ఫిల్టర్ లేకుండా రాయడమే రచయితకి ఉండాల్సిన మొదటి లక్షణం అని నా అభిప్రాయం. ఇది ఈ నవలలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మనందరి మొదటి ప్రేమల్ని సున్నితంగా తాకుతుందీ పుస్తకం. ప్రేమించడం ప్రేమించబడడం ఎంత అద్భుతంగా ఉంటాయో, ప్రేమ తరువాత జీవితం ఎలా ఉంటుందో కొత్త కోణంలో చెప్పారు రచయిత్రి.
ప్రేమలో ఉన్నప్పుడు ఉండే స్నేహాన్ని, అనుభవాలని, అనుభూతులు, బాధలు, భయాలు, ఎడబాటు, విరహం ఇలా అన్ని స్మృతులనూ కలిపి ఒక కొత్త అత్తరుని తయారు చేసి పుస్తకంలా మనకందించింది రచయిత్రి. చదివినంతనసేవు ఆ అత్తరు సువాసన మిమల్ని మీ మొదటి ప్రేమ దగ్గరకి తీసుకుపోయి, ఆ అనుభవాల్లో మరొక్కసారి జీవించేలా చేస్తుంది. మనసుల మధ్య జరిగే రొమాన్స్ నుంచీ ఎడబాటులో తీసుకునే నిర్ణయాల వరకూ అన్నీ పరిణితితో రాసారు కీర్తి ఇనుగుర్తి.
ఈ ప్రేమకథ మీది... నాది... మనందరిది...
Aarella Prema
I'm a product detail. I'm a great place to add more information about your product such as sizing, material, care and cleaning instructions. This is also a great space to write what makes this product special and how your customers can benefit from this item.

