top of page

పాలగిరి విశ్వప్రసాద రెడ్డి అన్న నాకు ఎప్పుడూ గుర్తొచ్చే మా ఊరు లాంటి వాడు. తొలిరోజుల్లో కథలు ఎలా రాయాలో తెలీక తల పట్టుకుంటున్నప్పుడు కనిపించిన ఒక వెలుగు. అప్పుడాయన కథలు నాకొక దారిని చూపించాయి. అప్పుడప్పుడు ఆయనతో కలసి కడప నుండి, మా మామోళ్ల ఊరు ప్రొద్దుటూరుకు బస్సులో వెళ్లేవాణ్ని. దారి వెంట కథల మీద అనేక రకాల ప్రశ్నలు వేసి అనుమానాలు నివృత్తి చేసుకునేవాణ్ని. ఆయన కనిపించినప్పుడల్లా ‘ఇంత బాగా కథలు ఎలా రాస్తాడా?’ అని నాకు నేను ఆశ్చర్యం ప్రకటించుకుని చూసేవాణ్ని. 
మనం మాట్లాడుకునే అతి సాధారణ పదంతో, సరళమైన వాక్యంతో భావాలను రాస్తారు. రచయిత తన భాషాపటిమతో కాకుండా పాత్రల కదలికలను చెప్పడం ద్వారా చదివేవాళ్ళలో ఫీల్ కలిగిస్తారు. మనల్ని కదిలిస్తారు. ఎక్కడో జరిగిన కథను మనకు చెప్పినట్లుండదు. మన కళ్ళ ముందు, పాత్రలు తమ జీవితాన్ని జీవిస్తుంటాయి.
ఇప్పటికీ నాకు రాయలసీమ కథ రాయాలి అంటే పాలగిరి విశ్వప్రసాద రెడ్డిని చదవడం అత్యవసరం. ‘కథలు ఇలా ఉండాలి..’ అని గంటల తరబడి చెప్పడం కన్నా ఒక్క మాటలో ‘పాలగిరి విశ్వప్రసాద రెడ్డిని చదువు’ అని చెప్పడమే సబబు. అదే నాకు సులువు.

-    డా. వేంపల్లె షరీఫ్‌, కథా రచయిత.

Nallaregadi Nelallo

SKU: 0005
₹300.00Price
Quantity
  • I'm a product detail. I'm a great place to add more information about your product such as sizing, material, care and cleaning instructions. This is also a great space to write what makes this product special and how your customers can benefit from this item.

bottom of page